ETV Bharat / state

విజయవాడలో అక్రమ మద్యం, గుట్కా పట్టివేత

విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

Illegal liquor and gutka smuggling in Vijayawada
విజయవాడలో అక్రమ మద్యం, గుట్కా పట్టివేత
author img

By

Published : May 26, 2020, 9:43 AM IST

పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మద్యం, గుట్కా ప్యాకెట్లను కృష్ణా జిల్లా చాట్రాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన రహదారుల వెంబడి కాకుండా డొంక దారుల గుండా తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లాకు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న అక్రమ మద్యాన్ని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని 281 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు. 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

నిశేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి రూ. 20 వేలు విలువచేసే 2200 ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడ నున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు వద్ద విజయవాడ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం తనిఖీలు చేపట్టింది. 25 మందిని అదుపులోకి తీసుకుని 751 మద్యం సీసాలను, 12 ద్విచక్రవాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైనా అక్రమ మద్యం రవాణాకు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, పీడి యాక్ట్‌, షీట్లు కూడా ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు తగవు:బార్ కౌన్సిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.