కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని ఐతవరం వద్ద అక్రమంగా తరలిస్తున్న గుట్కాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సరకు విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. గుట్కాతో పాటు ఒక కారును సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీచదవండి.