భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పంచవర్ష పరిశోధనా సూచన, పర్యవేక్షణ కమిటీలు కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని చేపల చెరువులను పరిశీలించాయి. కమిటీ చైర్మన్ జార్జ్ జాన్హార్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మరియు కమిటీ సభ్యులు చేపల చెరువులను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు పాటిస్తున్న పద్ధతులెంటనీ తెలుసుకోవటానికే వీరంతా వచ్చారనీ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆక్వా సాగులో ఉప్పునీరు మరియు తీపి నీరు వల్ల జరిగే లాభనష్టాల గురించి, ఉత్పత్తయ్యే చేప పిల్లల నాణ్యతపై రైతుల వివరణ కోరారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి పలు సూచనలు తెలుసుకోవటానికి వచ్చామని.. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామన్నారు. రైతులు చేస్తున్న పాటిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం మంచిదని ఆక్వా రైతులు తెలిపారు.
ఇదీ చూడండి :బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!