ETV Bharat / state

స్వచ్ఛ హీరోయిన్ : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హైదరాబాదీ - స్వచ్ఛ హిరోయిన్ : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హైదరాబాదీ

ఉన్నత చదువులు చదివిన ఓ యువతి... పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టింది. స్వచ్ఛ హైదరాబాద్‌కు కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తోంది. శివారు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వ్యర్థ నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసి.... చెత్త నుంచి సేంద్రీయ ఎరువులు తయారు చేస్తూ.. వాటిని రైతులకు ఉచితంగా అందిస్తోంది. ఆమె కృషికి మెచ్చిన కేంద్రం..... స్వచ్ఛ సర్వేక్షణ్‌-రియల్‌ హీరో పురస్కారం ప్రకటించింది. తనే సాహితీ స్నిగ్ధ.

స్వచ్ఛ హీరోయిన్ : పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టిన హైదరాబాదీ

author img

By

Published : Apr 11, 2021, 6:22 AM IST

Updated : Apr 11, 2021, 6:35 AM IST

కోటిన్నరకుపైగా జనాభా గల భాగ్యనగరంలో నిత్యం వేలాది టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నిర్వహణకు.. కోట్లు ఖర్చు చేస్తున్నా స్వచ్ఛ హైదరాబాద్ కల మాత్రం సాకారం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అన్నీ ప్రభుత్వాలే చేయాలనే ధోరణి మంచి కాదని.. ప్రజల సహకారమూ తోడవ్వాలంటోంది.. మోతీనగర్‌కు చెందిన సాహితీ స్నిగ్ధ. ఆ దిశగా తన వంతుగానూ కృషి చేస్తోంది.

గ్రీన్ టెక్నాలజీస్‌లో మాస్టర్స్..

చిన్నతనం నుంచే ప్రకృతి, పర్యావరణంపై సాహితీకి ప్రత్యేకాభిమానం. ఆ ప్రభావంతోనే ఇంజినీరింగ్‌ తర్వాత కాల్నిఫోరియా విశ్వవిద్యాలయం నుంచి గ్రీన్ టెక్నాలజీస్‌లో మాస్టర్స్‌ చేసింది. అమెరికా, కెన్యా, దుబాయ్‌ దేశాల్లోని పలు సంస్థల్లో పునరుత్పాదక శక్తి వనరుల వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసింది. ఎన్​జీవోలు, ప్రభుత్వ సంస్థలతో కలిసి వాతావరణ మార్పులు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేసింది.

వేస్ట్ వెంచర్స్ ఇండియా సంస్థలో మేనేజర్‌గా..

విదేశాల నుంచి 2018లో హైదరాబాద్‌కు చేరుకున్న సాహితీ స్నిగ్ధ వ్యర్థాల నిర్వహణపై పనిచేస్తున్న వేస్ట్ వెంచర్స్ ఇండియా సంస్థలో మేనేజర్‌గా చేరింది. ఈ సంస్థ నగరంలోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యునిటీల్లో ఆహార వ్యర్థాల నిర్వహణపై శిక్షణనిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పాఠశాలల్లో వ్యర్థాలను వేరు చేయడంపై అవగాహన కల్పిస్తుంది. ఈ సంస్థల్లో చురుగ్గా పనిచేసిన సాహితీ.. మూడేళ్లల్లోనే సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంది.

జీరో వేస్టేజ్‌ పట్టణంగా..

ఈ యువతి నేతృత్వంలోనే.. అపార్టుమెంట్లు విడిచి పట్టణ ప్రాంతాల్లోని వ్యర్థాల సమస్యల పరిష్కారానికి ముందుకు కదలింది వేస్ట్‌ వెంచర్స్‌ ఇండియా. అలా జీరో వేస్టేజ్‌ పట్టణంగా తయారుచేయాలనే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పురపాలకలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించారు. గండిపేట వెల్ఫేర్ సొసైటీతో సహకారంతో ఖానాపూర్ గ్రామ డంపింగ్ యార్డ్‌ బాధ్యతలు తీసుకుంది సాహితీ.

రోజుకు 2 టన్నుల వ్యర్థాలు..

పారిశుద్ధ్య కార్మికులు, చిత్తుకాగితాలు సేకరించే వాళ్ల సహకారంతో.. రోజుకు 2 టన్నుల వ్యర్థాలు ప్రాసెస్‌ చేస్తోంది.. ఈ యువతి. తడి వ్యర్థాలతో రోజుకు 200 కిలోల కంపోస్టు ఎరువు ఉత్పత్తి చేస్తూ.. ఉపయోగకరంగా మార్చివేస్తోంది. ఈ ఎరువు చుట్టపక్కల రైతులకు, ప్రజలకు ఇస్తూ.. కూరగాయలు, ఆకుకూరలు పెంచే విధంగా పోత్సహిస్తోంది. పొడిచెత్త నుంచి ప్లాస్టిక్, ఇనుము, ఇతర పదార్థాలను వేరు చేసి.. రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తుంది.. సాహితీ. ఫలితంగా వ్యర్థ రహిత డంపింగ్‌ యార్డ్‌గా గుర్తింపు సాధించింది.

లక్షలు తెచ్చే ఉద్యోగాలు వదులుకుని..

ఉన్నత చదువులు చదివి, లక్షలు తెచ్చిపెట్టే ఉద్యోగాలు వదులుకుని.. తన నగరానికి ఏదైనా చేయాలనే సాహితీ ఆలోచనకు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఈమె కృషిని గుర్తించిన కేంద్రం... 2021 స్వచ్ఛ సర్వేక్షణ్‌- రియల్ హీరో పురస్కారం ప్రకటించింది.

వ్యర్థ రహిత పరిసరాల కోసం..

తల్లిదండ్రులు, అత్తింటివారి ప్రోత్సాహంతో తానూ ఈ విధంగా పనిచేస్తున్నట్లు చెబుతున్న సాహితీ.. వ్యర్థ రహిత పరిసరాల కోసం యువత కృషి చేయాలని సూచిస్తోంది. ఆసక్తి ఉంటే.. వారాంతాల్లో వాలంటీర్లుగా సేవలందించాలని కోరుతోంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. దేశానికి సేవ చేసినట్లే అంటోది.

కలుషితం కాకుండా కృషి..

వ్యర్థాల నిర్వీర్యం ద్వారా.. భూమిని కలుషితం కాక కాపాడుతోంది ఈ స్వచ్ఛ సైనికురాలు. హైదరాబాద్‌, యావత్త్ దేశాన్ని వ్యర్థ రహితంగా తయారుచేసేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానంటోంది.

ఇవీ చూడండి : నేటి నుంచి టీకా ఉత్సవ్.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత

Last Updated : Apr 11, 2021, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.