కృష్ణా జిల్లా పామర్రు మండలం కొండిపర్రులో విద్యుదాఘాతంతో 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగిన కారణంగా.. అక్కడ నివాసముంటున్న వారు పరుగులు తీశారు.
ఓ ఇంట్లో పక్షవాతంతో బాధపడుతున్న రోగి బయటకు రాలేక తీవ్ర గాయాలపాలయ్యాడు. అతడిని మచిలీపట్నం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు చెప్పారు.
ఇదీ చదవండి: