కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లి తొమ్మిదో వార్డులో భార్యాభర్తలపై ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్ బాషా, మచిలీపట్నం రూరల్ సీఐ కొండయ్య, పెడన ఎస్సై మురళీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.
ఇవీ చూడండి...