ETV Bharat / state

అందుబాటులోకి వైద్యసేవలు...క్రమేపీ పెరుగుతున్న ఓపీ - అందుబాటులోకి వైద్యసేవలు...క్రమేపీ పెరుగుతున్న ఓపీ

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించారు. పాజిటివ్‌ రోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో దాదాపు రెండు నెలలకు పైగా కృష్ణా జిల్లా ఆసుపత్రిలో నిలిచిపోయిన సాధారణ వైద్యసేవలు క్రమేపీ అందుబాటులోకి వస్తున్నాయి. రోగుల పరిస్థితిని బట్టి శస్త్రచికిత్సలు కూడా కొనసాగుతున్నాయి. అన్ని విభాగాలకు సంబంధించిన రోగులు వస్తుండటంతో రోజు వారీ ఓపీ సంఖ్య దాదాపు 500 పైచిలుకు ఉంటోంది.

అందుబాటులోకి వైద్యసేవలు...క్రమేపీ పెరుగుతున్న ఓపీ

author img

By

Published : Jun 11, 2020, 1:38 PM IST

కృష్ణా జిల్లాలో 88 ప్రాథమిక, 12 సామాజిక, 2 ప్రాంతీయ ఆసుపత్రులతోపాటు 650 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. అత్యధిక శాతం రోగులు విజయవాడతో పాటు మచిలీపట్నం జిల్లా ఆసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. ఇటీవల కాలంలో జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో వైద్యులు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా రోజుకు ఓపీ అధికంగా నమోదవుతోంది. అనూహ్యంగా విరుచుకుపడ్డ కరోనా వైరస్‌ కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. లాక్‌డౌన్‌తో పాటు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వైద్యసేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

జిల్లా ఆసుపత్రిని కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించడంతో అన్ని వార్డులు ఖాళీ చేయించారు. ఓపీ సైతం నిలిచిపోయింది. ఫలితంగా రెండు నెలల పాటు రోగులకు ఆసుపత్రి నుంచి సాధారణ వైద్యసేవలు పూర్తి స్థాయిలో అందకుండాపోయాయి. అత్యవసర వైద్య సేవలు అందించే నిమిత్తం కొన్ని రోజుల క్రితం వరకూ నిర్ణీత సమయం మేర ఓపీ సేవలందిస్తూ వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణ సదుపాయాలు లేకపోవడంతో రోగులు వచ్చేందుకు కూడా వీలుకాలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లాక్‌డౌన్‌ 4 సందర్భంగా నిబంధనలు సడలించే వరకూ పూర్తి స్థాయి సేవలు నిలిచిపోయాయి.

కరోనా పాజిటివ్‌ కేసుల కోసం 40 బెడ్‌లు

కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఐసోలేషన్‌ వార్డులుగా సిద్ధం చేశారు. 200 పడకల వరకూ అందుబాటులో ఉంచారు. కొవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించాక ఇప్పటి వరకూ కరోనా లక్షణాలున్న 120 మందికి పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రాథమిక చికిత్స అందించారు. వీరిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో విజయవాడకు తరలించారు. ప్రస్తుతం వ్యాధి లక్షణాలతో ఉన్న వారు లేకపోవడంతో బెడ్‌లు ఖాళీగానే ఉన్నాయి. కరోనా లక్షణాలతో వచ్చే వారికోసం 40 బెడ్‌లు సిద్ధంగా ఉంచారు. అవసరానికి అనుగుణంగా తక్షణం ఏర్పాటు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి ఆర్ధో, జనరల్‌ శస్త్ర చికిత్సలను కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. అన్ని విభాగాల ఓపీలు ప్రారంభంకావడంతో పలువురు రోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

అందుబాటులో అన్ని సేవలు

జిల్లా ఆసుపత్రిలో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యవసర శస్త్ర చికిత్సలతో పాటు ఆసుపత్రికి వచ్చిన వారందరికీ చికిత్స చేసి పంపిస్తున్నాం. ఐసోలేషన్‌ వార్డుల కారణంగా సాధారణ రోగులకు అందించే సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్యసేవలను మరింత విస్తృతం చేస్తాం. - డాక్టర్‌ మల్లికార్జునరావు, ఆర్‌ఎంవో

ఇదీ చదవండి: చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం... కారణమేంటి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.