ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన్ను 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును సస్పెండ్ చేస్తూ ఈ నెల 24 న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను.. మరో 3 వారాలు పొడిగించింది.
ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. జస్టిస్ సీ.ప్రవీణ్ కుమార్ , జస్టిస్ బీ.కృష్ణమోహన్ తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ధర్మాసనం ముందు లెటర్ పేటెంట్ అప్పీల్ దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో అప్పీల్ దారు తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి:
Mansas Trust: చైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే: మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం