ETV Bharat / state

'కృష్ణపట్నం భూములపై విచారణ ఈ నెల 29కి వాయిదా' - High court on krishna patnam lands

ప్రభుత్వంపై కృష్ణపట్నం ఇన్​ఫ్రాటెక్ ప్రైవేట్​ లిమిటెడ్ సంస్థ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

కృష్ణపట్నం భూముల వ్యాజ్యంపై ... నేడు హైకోర్టులో విచారణ
author img

By

Published : Oct 25, 2019, 5:32 AM IST

Updated : Oct 25, 2019, 4:36 PM IST

రిజిస్టర్ దస్తావేజుల ద్వారా తమకు విక్రయించిన 4,731 ఎకరాల భూమిని ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాల్​ చేస్తూ.. కృష్ణపట్నం ఇన్​ప్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ నెల 19న ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ( ఏపీఐఐసీ ) జారీ చేసిన లేఖను రద్దు చేయాలని కోరుతూ.. ఆ సంస్థ తరఫున చీఫ్ ఫైనాన్షియల్ అధికారి కె . గౌరి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలోని కోట , చిల్లకూరు మండలాల పరిధిలోని తమకు చెందిన 4,731 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని నిలువరించాలని పిటిషన్​లో కోరారు. ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, ఎండీ, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు,పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు.

ఇవీ చదవండి:

"పోలవరం భూ నిర్వాసితుల దస్త్రాలు, రికార్డులు ఇవ్వండి"

sample description
Last Updated : Oct 25, 2019, 4:36 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.