విజయవాడ సహ కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో నగరం జలమయమైంది. ప్రధాన రహదారులు సహా కాలనీల్లో భారీగా నీరు చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కుండపోత వర్షంతో నగరంలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణానది ఉప నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తోంది. బ్యారేజీ ఇప్పటికే నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఇదీ చూడండి