కొల్లేరు సరస్సు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ ఎత్తున వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రహదారి బంధాలు తెగిపోయాయి. ముఖ్యంగా కైకలూరు- ఏలూరు ప్రధాన రహదారిపై నుంచి రెండు అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. కదిరి గుడి వద్ద కొల్లేరు ప్రవాహం మునుపెన్నడూ లేని విధంగా 12 అడుగుల ప్రవాహం ఉంది.
కొల్లేరు లంక గ్రామాల్లో వరద నీరు పోటెత్తడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లోని చేపల చెరువులు గండి పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేపల్ని రక్షించుకోవడానికి వలలు ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు. మరిన్ని చెరువులకు వరద ముప్పు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: