క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు సీఎం పలు సూచనలు చేశారని.. వారికి భోజనం, శానిటేషన్, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వివరించారు. క్వారంటైన్ ముగిసి ఇళ్లకు వెళ్ళేటప్పుడు రూ.300, మొత్తంగా ఒక్కొక్కరికి రూ.900 ఇస్తున్నామని తెలిపారు.పేద, మధ్య తరగతి వారికి అదనపు సహాయంగా మరో రూ.2 వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీన్ని సైతం త్వరలో అమలు చేస్తామని స్ఫష్టం చేశారు. పరికరాల విషయంలో మొదట ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ... ఇప్పుడు రాష్ట్రంలో నిత్యం 10 వేల పీపీఈలు తయారవుతున్నాయని తెలిపారు. మాస్కులు సైతం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐసీఎంఆర్ నిబంధనలు మేరకు అందరికీ రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ప్రకటించారు.
ఇవీ చూడండి..