మార్చి 22 న నగదు వసూలు చేసుకుని నాగరాజు, నానిలు కలిసి హోటల్ గదికి వెళ్తుండగా... రవీంద్ర మరో ఇద్దరితో కలిసి మార్గ మాధ్యంలో వాళ్ల వాహనాన్ని ఆపారు. టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ బెదిరించి వారి వద్ద 30 లక్షల నగదును దోచుకున్నాడు. ఆపై హోటల్ గదికి కూడా వెళ్లి కోటి రూపాయల నగదును సైతం దోచుకున్నారు. నాని వద్ద మరో 45 లక్షలు మిగిలి ఉన్నాయి. ఆ డబ్బును నాని, నాగరాజు, దాసు పంచుకున్నారు. మొత్తం డబ్బంతా దొంగలు దోచుకెళ్లారని యజమాని అభినవ్రెడ్డికి చెప్పగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. ఇంటి దొంగలను అరెస్ట్ చేసి కోటి 36 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్ర మాత్రం పరారీలో ఉన్నాడు.
కోటి 36లక్షల నగదు రికవరీ
జరిగిన సంఘటనలో కీలకసూత్రధారులు నాని ,రవీంద్రలేనని పోలీసులు గుర్తించారు .ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి కోటి 36 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా జరుగుతుంది? దేనికోసం నగదును వినియోగిస్తున్నారని ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో నగదు పంచేందుకు తీసుకెళ్తున్నారా ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తీరును గమనిస్తే నగరంలో మనీ లాండరింగ్ జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. తనకు విదేశాల్లో వ్యాపారాలుఉన్నాయని, పోయినడబ్బంతా మిర్చి వ్యాపారానికిసంబంధించినదేనని అభినవ్‌రెడ్డిపోలీసులకు తెలిపాడు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని పోలీసులు అంటున్నారు.
30 కేజీల మిర్చి అడిగితే... రూ. 30 లక్షలు ఇస్తారు
విజయవాడ కాళేశ్వర మార్కెట్లోని హాల్ సేల్ దుకాణంలోకి వెళ్లి 30 కేజీల మిర్చికావాలి అంటాడు ఓ వినియోగదారుడు. వెంటనే షాపు యజమాని 30 లక్షల రూపాయలను అతనికి ఇస్తాడు. ఇదేంటి అనుకుంటున్నారా ?... ఇదే ఇప్పుడు వ్యాపారం ముసుగులో విజయవాడలో జరుగుతున్న అక్రమ నగదు రవాణా. అంతా కోడ్ బాషలోనే జరిగే ఈ లావాదేవీల గుట్టును పోలీసులు ఛేదించారు