ఏపీ సాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఏపీఎండీసీ ఎండీ ఎం.హరి నారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక సరఫరాను సరళతరం చేసేలా ఏపీ సాండ్ కార్పొరేషన్ లిమిటెడ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్లబళ్లు ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకుని వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సాధారణ వినియోగదారుల, బల్క్ వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా.. ఇసుక సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు