పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానమే ఒక్కోసారి ప్రమాదాలకు దారితీస్తుంది. ఫేస్ బుక్, ఇన్గ్రామ్ల్లో చాటింగ్, మనకు నచ్చిన పోస్టింగ్‌లు పెట్టుకోవచ్చు. ఇదే అదనుగా చూసుకుని విజయవాడలో కొంతమంది మహిళలను వేధిస్తున్నారు. మొదట పరిచయం పెంచుకొని తర్వాత వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటారు.
ఫేస్ బుక్‌లో అప్ లోడ్ చేసిన ఫొటోలతో నకిలీ ఖాతాలను తెరచి మహిళలను వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. విజయవాడ పెనమలూరుకు చెందిన మహిళకు ఓ అగంతుకుడు ఫోన్ చేసి తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే అశ్లీల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించాడు.
దీంతో షాక్‌తిన్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఖాతాగా గుర్తించారు. నిందితుడు బాధితురాలి పేరుతో నకిలీ ఖాతాలు తెరుస్తున్నట్లు గుర్తించారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు నిందితుడు రెండు రోజులకు ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు విశాఖలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి పరిచయమున్న వ్యక్తే వేధించాడని విచారణలో తేలింది.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు పొందుపరచవద్దని పోలీసులు సూచించారు. లైక్‌ల కోసం, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు జీవితాన్నినాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి