ETV Bharat / state

చేనేత కార్మికులకు.. సాయం మాటున 'రాయితీలపై వేటు' - latest news on YCP guarantees to handloom workers

Handloom workers in ap: నేతన్న నేస్తం పథకంతో చేనేత కార్మికుల జీవితాలను ఉద్ధరిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. ఆ 24 వేల రూపాయలు.. తమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయని నేతన్నలు వాపోతున్నారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది.... ఒక చేతితో నేతన్న నేస్తం పథకం ఇస్తూ మరోక చేతితో చేనేత కార్మికులకు అందాల్సిన రాయితీలను నిలిపివేసింది. దీంతో చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కురుకుపోతున్నాయి. కార్మికులకు సరిగా పని కల్పించలేని స్థితిలోకి వెళ్లిపోతున్నాయి.

చేనేత కార్మికులకు.. సాయం మాటున 'రాయితీలపై వేటు'

author img

By

Published : Feb 8, 2023, 7:20 AM IST

Handloom workers in Krishna district: చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నామని.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. ఒక చేత్తో నేతన్ననేస్తం పథకం పేరుతో సాయం చేస్తూ.. మరో చేత్తో రాయితీలను నిలిపేసింది. గత ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలతో లాభాలు ఆర్జిస్తూ వచ్చిన చేనేత సహకార సంఘాలు.. ప్రసుత్తం నష్టాల బాటపట్టి.. క్రమంగా అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కార్మికులకు పని కల్పించలేని స్థితిలోకి వెళ్లిపోయాయి. సహకార సంఘాల భవనాలను అద్దెకు ఇచ్చి.. ఆ డబ్బుతో సంఘాలను నడుపుకునే స్థితికి పడిపోయాయి.

నేతన్న నేస్తం పథకంతో చేనేత కార్మికుల జీవితాలను ఉద్ధరిస్తున్నామని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే.. ఆ 24 వేల రూపాయలు.. తమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయని నేతన్నలు వాపోతున్నారు. సాయం చేసినట్లే చేసి.. తమకు రావాల్సిన రాయితీలను ప్రభుత్వం నిలిపివేసిందని.. దీని వల్ల అప్పుల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 36 చేనేత సహకార సంఘాలు ఉంటే.. వాటిల్లో ఎక్కువ శాతం అప్పుల్లోనే ఉన్నాయని.. సంఘాల నాయకులు, సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నిలిచిపోవడంతో... చేనేత సహకార సంఘాలకు, కార్మికులకు మధ్య దూరం పెరిగింది.

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ.. తెలుగుదేశం ప్రభుత్వం పలు రాయితీలను కల్పించింది. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక వాటినన్నింటినీ నిలిపివేసి.. నేతన్న నేస్తం పథకం పేరుతో.. సంవత్సరానికి 24 వేల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా నెలలో సగం రోజులు కూడా కార్మికులకు పని కల్పించలేకపోతున్నామని.. చేనేత సహకార సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల తాము చాలా నష్టపోతున్నామని కార్మికులు వాపోతున్నారు.

గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాల వల్ల.. ఒక్కో చేనేత కార్మికుడికి సుమారు లక్షన్నర రూపాయల మేర ఆర్థిక మేలు చేకూరేదని.. కార్మికులు చెబుతున్నారు. ప్రస్తుతం వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఇస్తున్న 24 వేల రూపాయలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల చాలా మంది చేనేత కార్మికులు వృత్తిని వదిలేసి.. కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించాల్సిన సాయంలో పక్షపాత వైఖరి చూపుతోందని.. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు లక్షా 38 వేల మగ్గం కలిగిన చేనేత కుటుంబాలు ఉంటే.. కేవలం 81 వేల మందికి మాత్రమే నేతన్న నేస్తం నిధులు ఇస్తున్నారని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.