ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించాలి అని స్పష్టం చేశారు. ద్విచక్రవాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించేలా ఉండాలని సూచించారు.
చిన్న పిల్లలను, వృద్ధులను బయటకు తీసుకురావద్దని ప్రజలకు తెలిపారు. 2 రోజుల తరువాత మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వ సూచనలు పాటించి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాధి నివారణకు తమ వంతు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: