కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవొలులో కాట్రగడ్డ బాపినీడు, భారతిల ట్రస్ట్ తరఫున గ్రామస్థుడు కాట్రగడ్డ రమేష్ బాబు.. సొంత ఖర్చుతో దాదాపు వెయ్యి కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. గుడివాడ ఆర్డీవో శ్రీనుకుమార్, డీఎస్పీ సత్యానందం వీటిని పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన రమేష్‌ను అధికారులు అభినందించారు. కరోనా పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి..