పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయం.. ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని సైతం భక్తులకు అందిస్తోంది. ఆలయ ప్రాంగణం రకరకాల మొక్కలతో పచ్చదనం నిండి కనువిందు చేస్తోంది. అమ్మవారిపై భక్తి పారవశ్యంతో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఇక్కడి వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతోంది.
పలురకాల మొక్కలు ఆలయానికి కొత్త కళను తీసుకువస్తున్నాయి. ఆలయ ముఖమండపం చుట్టూరా ఉన్న మొక్కలు చూస్తూ.. భక్తులు ఆనంద పారవశ్యానికి లోనవుతున్నారు. కృష్ణా జిల్లాలో ఏ ఆలయంలో లేన విధంగా ఇక్కడి అధికారులు, సిబ్బంది పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఓ చేతిలో స్నాక్స్.. మరో చేతిలో కూల్ డ్రింక్.. ఎంజాయ్ చేస్తున్న వానరం!