కృష్ణా జిల్లాలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నందిగామ మండలం లింగాలపాడులో... గ్రామ తిరుణాళ్ల సందర్భంగా రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ గొడవలో రెండు పార్టీలకు చెందిన వారు గాయపడ్డారు. వారిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: