రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ ప్రోటోకాల్ పద్ధతిలో పెట్టే అనవసర ఖర్చులు నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. ప్రోటోకాల్ పేరిట ఏర్పాటు చేసే ఎర్ర తివాచీలు, ఆడంబరాలు వద్దని అధికారులను ఆదేశించారు. రాజ్యాగ బద్ధమైన కార్యక్రమాలకు మాత్రమే ప్రోటోకాల్ నిర్వహిస్తే సరిపోతుందని సూచించారు. ఇటీవల శ్రీశైలం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆలోచనకు అంకురార్పణ చేసిన గవర్నర్ దానిని ఆచరణలోకి తీసుకు రావాలని నిర్ణయించారు. అలాగే ‘హిజ్ ఎక్సలెన్సీ’ పేరిట సాగే ప్రత్యేక ప్రస్తావన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను కలిసేందుకు వచ్చే వారి నుంచి పుష్ప గుచ్ఛం స్వీకరించే విధానాలకు దాదాపుగా స్వస్తి పలికిన గవర్నర్, తనకోసం వచ్చే ఎవరైనా మొక్కలను తీసుకురావాలని కోరారు. ఇలా వస్తున్న మొక్కలను రాజ్ భవన్ ప్రాంగణంలో నాటుతున్నారు .
ఇదీ చూడండి: