కరోనా కట్టడి కోసం జనతా కర్ఫ్యూ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు వైద్య సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి ఇళ్లలోనే ఉన్న ప్రజలు సాయంత్రం ఐదు గంటలకు ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి బయటికి వచ్చిన చప్పట్లు కొట్టారు. రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సైతం ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఇతర సిబ్బంది సేవలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూకి మద్దతుగా సీఎం జగన్ చప్పట్లు