ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా.. విజయవాడ రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అభివృద్ధి యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని ఆకాంక్షించారు. రేపు జరగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలన్నారు. ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక వంటిదని ఆ దిశగా పాలన సాగాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండాలన్నారు. సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు.
ఇవీ చదవండి: పాఠశాలలను ప్రారంభించేందుకు తగు ఏర్పాట్లు