బ్రహ్మకుమారి సంస్ధ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రాజయోగి దాది హృదయ మోహిని ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల వయసులో బ్రహ్మ కుమారి సంస్ధలో చేరిన దాది హృదయ మోహిని చేరినట్లు ఆయన తెలిపారు. సంస్థ సేవలో తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆధ్యాత్మిక భావన, ఆత్మ చైతన్యం, ధ్యానం, సాధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారని వివరించారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజయోగిని దాది హృదయ మోహిని తన జీవితాన్ని అంకితం చేశారన్న గవర్నర్.. బ్రహ్మ కుమారి సంస్థ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: 'పురపాలక ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'