ETV Bharat / state

పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామి కావాలి: గవర్నర్ - లయోలా కళాశాలలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

కృష్ణా జిల్లా విజయవాడ లయోలా కళాశాలలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. యువత పర్యాపరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు.

Governor Bishwabhushan Harichandan initiated the planting of one lakh plants at  Vijayawada Loyola College, krishna district
లయోలా కళాశాలలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
author img

By

Published : Dec 11, 2019, 5:25 PM IST

లయోలా కళాశాలలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

వాతావరణంలో కలిగే మార్పులు... భావి తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కాలుష్యాన్ని ఇలాగే కొనసాగనీయకుండా మేధావులు, పౌరసమాజం... పర్యావరణ పరిక్షణకు తమ వంతు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా కొనసాగించాలని కోరారు. విజయవాడ లయోలా కళాశాలలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్‌ లాంఛనంగా ప్రారంభించారు. రెండు, మూడు నెలలుగా దేశ రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్యం సృష్టించిన ఇబ్బందులు అందరికీ తెలిసినవేనని గవర్నర్‌ చెప్పారు. దిల్లీ పర్యటనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తాయని... విద్యాలయాలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితులు మరే ఇతర నగరాల్లోనూ రాకుండా అందరూ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్యం ఏ ఒక్క దేశానికో పరిమితమైన వ్యవహారం కాదని.. ప్రపంచం మొత్తం దీనిపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భూతాపాన్ని తగ్గించడం, కర్భన ఉద్గారాల నియంత్రణ అవసరమన్నారు. పుడమి తల్లి పచ్చగా.. వనాలతో వర్థిల్లితేనే జీవరాశికి మనుగడ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భూమి ఆపదలో ఉన్న విషయాన్ని అనేక అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలని బిశ్వభూషణ్‌ కోరారు.

ఇదీ చదవండీ:

హైదరాబాద్ కొంపల్లిలో మార్గదర్శి చింట్​ఫండ్ 107వ శాఖ ప్రారంభం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.