ETV Bharat / state

'రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి' - crop loss in andhrapradesh

ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాలతో పార్టీ నేతలు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కర్షకుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

TDP
TDP
author img

By

Published : Nov 29, 2020, 7:49 PM IST

నివర్‌ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం నేతలు డిమాండ్‌ చేశారు. బాధిత రైతులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులకు ఎకరాకు 25వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తుపాను నష్టాన్ని అంచనా వేస్తూ బాధితులను ఓదార్చేందుకు తెదేపా నేతలు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా నివర్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

కృష్ణా జిల్లా నందిగామ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వరి పంట పొలాలను తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్య రైతులతో కలసి పరిశీలించారు. అన్నదాతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నా అధికారులు కనీసం పంట నష్టం అంచనా వేయడానికి ఎందుకు రావడం లేదని ఆమె నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్​లో పర్యటించి రైతులకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో చెప్పాలని నిలదీశారు.

మొక్క మొలిచినా కొనుగోలు చేయాలి

కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పరిధిలోని విశ్వనాధపల్లి, నారేపాలెం, పిట్టలంక, సాలెంపాలెం గ్రామాలలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పర్యటించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. నివర్ తుపాను రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం విఫలం

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలంలో నివర్ వల్ల నష్టపోయిన పంటలను తెదేపా నేతల బృందం ఆదివారం పరిశీలించింది. తెదేపా నరసరావుపేట పార్లమెంట్ ఇన్​ఛార్జ్​ జీవీ ఆంజనేయులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, ఎస్టీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ ఛైర్మన్ దారునాయక్, మాచెర్ల నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​ కొమ్మారెడ్డి చలమారెడ్డి.... రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతుల్ని ముందస్తుగా అప్రమత్తం చేయడం, పంట నష్టం అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని జీవి ఆంజనేయులు విమర్శించారు.

తాడేపల్లి మండలంలో తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్ చౌదరి పరామర్శించారు. నీట మునిగిన పంటలను పరిశీలించారు. రైతుల బాధలను తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని నేతలు చెప్పారు.

ఎకరానికి రూ.30 వేలు ఇవ్వాలి

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, శాసనమండలి సభ్యుడు అంగర రామ్మోహన్ పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను వారు పరిశీలించారు. వైకాపా ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. తక్షణం ప్రభుత్వం ఎకరానికి 30 వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని జవహర్ డిమాండ్‌ చేశారు.

కౌలు రైతులకు చేయూతనివ్వాలి

తూర్పుగోదావరి జిల్లాలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలను తెలుగుదేశం నేతల బృందం పరిశీలించింది. సామర్లకోట మండలం గొంచాల, చంద్రంపాలెం, సవర, అచ్చంపేటల్లో పెద్దాపురం శాసన సభ్యుడు చినరాజప్ప, తెదేపా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ జ్యోతుల నవీన్, కాకినాడ మేయర్ సుంకర పావని తదితరుల బృందం పర్యటించి.. తడిసి ముద్దయిన వరి పంటను, ధాన్యాన్ని పరిశీలించారు.

వరుస విపత్తులతో తూర్పుగోదావరి జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రాజోలు నియోజవర్గంలోని మామిడికుదురు, మల్కిపురం మండలాల్లో దెబ్బతిన్న వరి పంటలను ఆయన పరిశీలించారు.

అసెంబ్లీలో నిలదీస్తాం

విశాఖ జిల్లాలో నివర్ నష్టాలను అంచనా వేసి రైతులను ఓదార్చేందుకు తెదేపా నాయకులు బృందాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు. చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలంలో తడిసిన వరి పంటను ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ బుద్దా నాగజగదేశ్వరరావు పరిశీలించారు. వడ్డాది, బంగారు మెట్ట గ్రామాల్లో పొలాలకు వెళ్లారు. బాధితులైన రైతులతో మాట్లాడి ఓదార్చారు. అలాగే కశింకోట మండలం నర్సంగ బిల్లి, ఎన్​జీ పాలెంలో నష్టపోయిన పంటలను మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయనతో కలసి ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు పరిశీలించారు.

రైతుల పట్ల సర్కార్ నిర్లక్ష్యం

నివర్ ప్రభావంతో నష్టపోయిన కర్షకులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ బాధ్యుడు కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పెడబల్లి కొత్తపల్లి పరిసర గ్రామాలలో పంటను కోల్పోయిన రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి

కేంద్రం ప్రతిపాదనకు రైతు సంఘాల నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.