ETV Bharat / state

స్థిరాస్తులన్నింటికీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్: సీఎం జగన్ - bhuraksha scheme

భూ వివాదాలకు చెక్ పెట్టడం, ట్యాంపరింగ్​కు తావులేని భూ రికార్డులు రూపొందించడమే లక్ష్యంగా సమగ్ర భూ సర్వే ప్రాజెక్టు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సమగ్ర సర్వేతో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరుతాయని, భూ వివాదాలకు తెరపడుతుందన్నారు. సర్వేలో కచ్చితమైన కొలతలు వస్తాయన్నారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష పథకం’ అమలు కోసం సర్వే ఆఫ్‌ ఇండియాతో అవగాహన ఒప్పందం కదుర్చుకున్న అనంతరం పథకం అమలు తీరు, సన్నద్దతపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.

ap and survey of india
ap and survey of india
author img

By

Published : Dec 9, 2020, 10:28 AM IST

Updated : Dec 9, 2020, 5:46 PM IST

స్థిరాస్తులన్నింటికీ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ : సీఎం జగన్

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూ రక్ష పథకం అమలు కోసం సర్వే ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కదుర్చుకుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి సమగ్ర సర్వే చేస్తున్నాయని, చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో సర్వే ఎక్కడా చేయలేదన్నారు. 100 ఏళ్లలో సబ్‌ డివిజన్లు, పంపకాలు క్షేత్రస్థాయిలో నమోదు కాని పరిస్థితి ఉందన్నారు. 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోందన్నారు. 14 వేల సర్వేయర్లను ప్రభుత్వం నియమించిందని.. 9400 మంది సర్వేయర్లు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని, జనవరి 26 కల్లా మిగిలిన వారికి ట్రైనింగ్‌ పూర్తవుతుందన్నారు.

స్థిరాస్తులన్నింటికీ యూనిట్ ఐడెంటింటీ నంబర్

భూములు, స్థలాలు సహా స్థిరాస్తులన్నింటినీ రికార్డుల్లోకి ఎక్కిస్తామని, రాళ్లు కూడా వేస్తామని, తర్వాత యూనిక్‌ ఐడెంటిటీ నంబర్‌తో కార్డు జారీ చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఆ కార్డులో క్యూఆర్‌ కోడ్‌ సహా హార్డ్‌కాపీ ఉంటాయన్నారు. ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాప్​లు కూడా గ్రామాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్‌ చేస్తామన్న సీఎం.. విలేజ్‌ హాబిటేషన్స్‌కు సంబంధించిన మ్యాపులు కూడా అందుబాటులోకి తీసుకొస్తారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సర్వే రికార్డులు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ఇంటి స్థలం, పొలం, లేదా మరో స్థిరాస్తిపై ఒక టైటిల్‌ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు అబ్జర్వేషన్‌లో అదే గ్రామ సచివాలయంలో పెడతామన్నారు. ఆ టైటిల్‌ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. తెలియజేయాలని కోరుతున్నట్లు తెలిపారు. రెండేళ్ల తర్వాత టైటిల్‌కు శాశ్వత భూహక్కు లభిస్తుందన్నారు. ఆ మేరకు టైటిల్‌ ఖరారు చేస్తారని .. ఆ తర్వాత కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రభుత్వమే బాధ్యత తీసుకుని పరిహారం చెల్లిస్తుందన్నారు.

అత్యాధునిక సాంకేతికతతో సర్వే

ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్న సీఎం జగన్.. ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 70 బేస్‌ స్టేషన్లు పెడుతున్నట్లు తెలిపారు. సర్వే ఆఫ్‌ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగం అవుతాయన్నారు. కచ్చితమైన కొలతలు ఉంటాయని, ఎర్రర్‌ అత్యంత సూక్ష్మస్థాయిలో 2 సెం.మీ. అటు ఇటుగా ఉంటుందన్నారు. సర్వే కోసం అత్యాధునిక సదుపాయాలు వాడుతున్నారని, కార్స్‌ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతున్నట్లు తెలిపారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్లు సర్వే చేస్తున్నామన్న సీఎం... మొదటి దశను డిసెంబర్‌ 21న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ప్రారంభమై, జులై 2021 వరకూ మొదటి విడత సాగుతుందన్నారు. ఆగస్టు 2021 నుంచి 6500 రెవెన్యూ గ్రామాల్లో రెండోవిడత ప్రారంభమై, 2022 ఏప్రిల్‌ వరకూ కొనసాగుతుందన్నారు. మిగిలిన గ్రామాల్లో జులై 2022 నుంచి జనవరి 2023 వరకూ కొనసాగి సర్వే పూర్తవుతుందన్నారు.

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు

మొదటి విడత పూర్తై, రెండో విడత ప్రారంభం అయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలలో సబ్‌ రిజిస్ట్రార్‌ సేవలు అందుతాయి. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు తీరిపోతాయని ..భూ వివాదాలకు చెక్‌ పడుతుందన్నారు. తద్వారా గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుందని, న్యాయమైన, చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయన్నారు. కుటుంబాలు, వారి వారసులకు మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. వివాదాలు పరిష్కరించడానికి అదే సమయంలో మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ పెడుతున్నామన్నారు. 660 మొబైల్‌ మేజిస్ట్రేట్‌ ట్రైబ్యునల్స్‌ పెడుతున్నామన్న సీఎం... ఆ విధంగా అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సమగ్ర సర్వేను కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలని సీఎం సూచించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు సాగాలన్నారు. ఇంకా అప్పిలేట్‌ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్‌ న్యాయమూర్తులతో వెంటనే ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. డ్రోన్స్‌ ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలో ఒక డ్రోన్‌ టీం, డాటా ప్రాసెసింగ్, రీ సర్వే టీంలు ఏర్పాటు చేయాలన్నారు.

ఐదు నిమిషాల్లోనే ల్యాండ్ రికార్డులు

సమగ్ర భూ సర్వేలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్ట్​నెంట్ జనరల్ గిరీష్ కుమార్ తెలిపారు. దేశంలోనే ఇలాంటి సర్వే తొలిసారి చేపడుతున్నామని.. మిగతా రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేవలం 5 నిమిషాల్లోనే కొలిచిన ల్యాండ్ రికార్డులు వస్తాయన్న ఆయన.. 2-3 సెంటీమీటర్ల అటు ఇటుగా కచ్చితత్వం ఉంటుందన్నారు. సమగ్ర సర్వే దార్శనికతతో కూడిన కార్యక్రమమని, ప్రపంచంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్లు తెలిపారు.

సర్వే వల్ల జరిగే మంచి ఏంటి? లాభాలు ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరికీ చెప్పాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. డిసెంబర్‌ 14 నుంచి 19 వరకూ గ్రామసభలు కూడా పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

Last Updated : Dec 9, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.