ఇప్పటికే ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా ట్రాక్టర్లకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో పాటు బలహీన వర్గాలకు నిర్మించే ఇళ్లు పథకానికి కూడా ఉచితంగానే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు. మరోవైపు పునరావాసంలో భాగంగా నిర్మించే గృహాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం ఏపీ వాల్టా చట్టంలో సవరణలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇవీ చూడండి...: వాట్సాప్తో సైబర్ నేరగాళ్ల మోసాలు