కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కరోనా కట్టడి, వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన మండిపడ్డారు. అనంతపురంలో సకాలంలో వైద్యం అందక చెట్టు కిందే భవన నిర్మాణ కార్మికుడు మరణించడం దురదృష్టకరమన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లోని ప్రజలకు, కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు పౌష్టికాహారం అందటం లేదని వాపోయారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది: సీపీఐ రామకృష్ణ - ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ మండిపాటు
కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న సీపీఐ రామకృష్ణ