ETV Bharat / state

బెజవాడ దుర్గ గుడిలో ఘనంగా గోపూజ మహోత్సం - gopuja news

ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో గోపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న చతుర్వేది హోమానికి వేద పండితులకు మాత్రమే ప్రవేశమని ఆలయ ఈవో స్పష్టం చేశారు. హోమాన్ని భక్తులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

gopuja
దుర్గ గుడిలో ఘనంగా గోపూజ మహోత్సం
author img

By

Published : Jan 15, 2021, 10:37 AM IST

Updated : Jan 15, 2021, 12:06 PM IST

బెజవాడ దుర్గ గుడిలో ఘనంగా గోపూజ మహోత్సం

విజయవాడ దుర్గగుడిలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సురేష్​బాబు, ఛైర్మన్ సోమినాయుడు పాల్గొన్నారు. దేవదాయ శాఖ ఆదేశాలతో ప్రత్యేకంగా గోపూజ నిర్వహించినట్లు ఈవో వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో సురేష్​బాబు మాట్లాడుతూ.. దుర్గగుడిలో రోజూ గోపూజ నిర్వహిస్తామనీ.. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని స్పష్టం చేశారు. గోశాల నిర్వహణకు భక్తులు విరాళాలు సమర్పించవచ్చునన్నారు. ఈనెల 18 నుంచి 25 వరకు దుర్గగుడిలో చతుర్వేది హోమం నిర్వహిస్తామనీ... వేదపండితులకే మాత్రమే ప్రవేశమన్నారు. భక్తులు హోమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. హోమంలో పాల్గొనేందుకు పలువురు పీఠాధిపతులు వస్తున్నారన్నారు.

గోసంరక్షణ, వేద పాఠశాల ట్రస్టులను దేవస్థానం నిర్వహిస్తోందని ఈవో తెలిపారు. గోవులను సంరక్షించాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందని ఆలయ ఛైర్మన్ సోమినాయుడు అన్నారు. గోవులను రక్షించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం గోపూజ నిర్వహిస్తోందన్నారు.

ఇదీ చదవండి: నేడు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ మహోత్సం- నరసారావుపేటలో పాల్గొననున్న సీఎం

Last Updated : Jan 15, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.