ETV Bharat / state

ప్రేమికుడే హంతకుడా... అత్యాచారం జరిగిందా? - girl murder in wanaparthy district

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత సమీపంలోని పత్తి చేనులో లభించిన యువతి మృతదేహం వివరాలు లభించాయి. ఆత్మకూరు పట్టణానికి చెందిన యువతిగా తేల్చిన పోలీసులు ఆమెకు అదే పట్టణానికి చెందిన యువకుడితో ప్రేమమ వ్యవహారం ఉందని తెలియడం వల్ల దర్యాప్తు ముమ్మరం చేశారు.

girl-was-killed-in-amarachintha
అమ్మాయి మృతదేహం గుర్తింపు
author img

By

Published : Nov 13, 2020, 11:56 AM IST

Updated : Nov 13, 2020, 12:25 PM IST

తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత సమీపాన పత్తి చేనులో బుధవారం లభ్యమైన యువతి మృతదేహం ఆత్మకూరు పట్టణానికి చెందిన యువతిదిగా గుర్తించారు.. గుర్తు తెలియని యువతి హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇప్పుడు వివరాలు లభ్యమవడం.. ఆమెకు అదే పట్టణానికి చెందిన ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని తేలడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.. ఆమె కాల్‌ డాటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన వారు వివరాలు సేకరిస్తున్నారు. యువతి ఒంటిపై దుస్తులు ఉన్న తీరుతో అత్యాచారం జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు ఆ విషయంపై స్పందించలేమని ఆత్మకూరు సీఐ సీతయ్య తెలిపారు.

కుటుంబసభ్యుల గుర్తింపుతో.. :

యువతి మృతదేహంపై ఉన్న దుస్తులు, ఆమె వస్తువులను పోలీసులు ఠాణాలో ఉంచారు. అప్పటికే తమ కుమార్తె కనిపించడం లేదని నాలుగైదు రోజుల నుంచి వెతుకుతున్న ఆమె కుటుంబ సభ్యులు ఠాణాకు వచ్చి ఆ వస్తువులు తమ కుమార్తెవేనని గుర్తు పట్టారు. ఆమె వివరాలు వెల్లడించారు. ‘ఆమె హైదరాబాద్‌లోని ఒక షోరూంలో అయిదేళ్లుగా పనిచేస్తోంది. గత శుక్రవారం సాయంత్రం అన్నకు ఫోన్‌ చేసి తాను కొత్తకోట దగ్గరలో ఉన్నానని, ద్విచక్ర వాహనంతో కొత్తకోటకు వచ్చి తీసుకొని వెళ్లాలని కోరింది. ఆయన కొత్తకోటకు వెళ్లగా కన్పించలేదు.

చరవాణికి ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా ఎత్తలేదు. రాత్రి 9 గంటలకు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. 10 గంటలకు మరోసారి ప్రయత్నించగా రింగ్‌ అవుతున్నా సమాధానం లేదు. రాత్రి 11:30 గంటలకు మళ్లీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. రాత్రికి తెలిసిన చోట్లలో వెతికినా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. శనివారం ఉదయం మరో నంబరుతో తాను క్షేమంగా ఉన్నాను.. దిగులు వద్దు అని యువతి పేరుతో సందేశం రావడంతో ఫోన్‌ చేయగా కలవలేదు. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని ఆందోళనలో ఉన్న సమయంలో యువతి హత్య గురించి తెలిసి ఠాణాకు వచ్చాం’ అని వారు తెలిపారు. ఆత్మకూరుకు చెందిన యువకుడిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు.

తెలిసిన వారికే సాధ్యం :

బీటీ రహదారి పక్క నుంచి ఒక కిలో మీటరు దూరంలో ఉన్న పత్తి పొలంలో మృతదేహం లభ్యం అయింది. అంత లోపలికి యువతిని తీసుకెళ్లారంటే ఆ ప్రాంతం గురించి తెలిసిన వారికే సాధ్యమని స్థానికులు పేర్కొంటున్నారు. యువతి ముఖం ఆనవాళ్లు తెలియకుండా పెట్రోలు పోసి దహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పడి ఉన్న ప్లాస్టిక్‌ సీసాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ముందస్తు ప్రణాళికతోనే ఇంత దూరం యువతిని తీసుకువచ్చి హత్య చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మకూరుకు చెందిన యువకుడితో ఆ యువతికి మూడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం ఉంది. ఇటీవల అతను వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఏమైనా గొడవలు జరిగి ఈమెను అడ్డు తొలగించుకోవడానికి హత మార్చాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యువతి ఒంటిపై జీన్స్‌ ప్యాంటు ఉన్న తీరుతో అత్యాచారం, హత్య కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇవీ చూడండి...

'నా చావుకు ఎవరు బాధ్యులు కారు..'

Last Updated : Nov 13, 2020, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.