కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి షకీలా అనే బాలిక మృతిచెందింది. పట్టణంలోని గొంతు వైద్యశాలలో ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మరణించిందని.. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులతో మాట్లాడారు.
ఇవీ చదవండి... అరుణాచల్‌ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం..!