పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతాలను యజ్ఞ కాశీభట్ల శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు సదాశివ శాస్త్రి ఏకధాటిగా 12 గంటలపాటు ఆలపించారు. విజయవాడ కౌతా పూర్ణానంద కళావేదికలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘంటసాల ఆలపించిన ఏకగళ గీతాలు 'గాన రవళి' పేరిట... పప్పు సదాశివ శాస్త్రి ఆలపించారు. 12 గంటల పాటు ఘంటసాల గీతాలను ఆలపించడం తన పూర్వజన్మ సుకృతం అని పప్పు సదాశివ శాస్త్రి శర్మ పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆయన గీతాలు వింటూ మైమరచిపోయారు.
ఇదీ చూడండి: