కృష్ణా జిల్లా మైలవరంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మైలవరంలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అద్దెకు ఉంటున్న గదిలో... 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని విచారించగా... విశాఖ నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్లు చెప్పాడు. చింతపల్లి మండలం కందులగాడికి చెందిన కిల్లో ప్రసాద్, కిల్లో మోహన్, వంతల దేవుడు గంజాయి సరఫరా చేస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి చెప్పిన ఆధారాలతో విశాఖ మన్యం వెళ్లి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి నుంచి 13 కిలోల గంజాయి, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: పరిటాలలో గుట్కా స్వాధీనం... ఇద్దరు నిందితుల అరెస్టు