మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేసి గాంధీ మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు.
అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి ఇద్దరు నేతలు చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. .