ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గాజుల ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల మట్టి గాజులతో అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిపై 2016 నుంచి ప్రారంభించిన ఈ విశేష పూజ ఎంతో ప్రాచుర్యం పొందింది. సుమారు 2లక్షలకుపైగానే గాజుల దండలతో ఇంద్రకీలాద్రిని అలంకరించారు.
కార్తీక మాసంలో రెండో రోజున అమ్మవారికి భక్తులు గాజులు, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
ఇదీ చూడండి:
KARTHIKA MASAM SPECIAL: కార్తిక మాసోత్సవాలు.. వేకువజాము నుంచే కిటకిటలాడుతున్న ఆలయాలు