ETV Bharat / state

ఇక నుంచి వారి గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి : కృత్తికా

author img

By

Published : Oct 8, 2020, 6:29 AM IST

బాలలపై లైంగిక దాడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శిశు సంక్షేమశాఖ సంచాలకులు డా.కృత్తికా శుక్లా స్పష్టం చేశారు. ఫోక్సో చట్టంలో నూతనంగా వచ్చిన నిబంధనలపై వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇక నుంచి వారి గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి : కృత్తికా
ఇక నుంచి వారి గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి : కృత్తికా

బాలలపై లైంగిక దాడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని శిశు సంక్షేమశాఖ సంచాలకులు డా.కృత్తికా శుక్లా స్పష్టం చేశారు. ఫోక్స్ చట్టంలోని నూతన నిబంధనలపై వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఆమె అవగాహన కల్పించారు.

పోలీస్ నివేదిక..

పోక్సో చట్టం అమలు చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసిందన్నారు. గుంటూరులో మొదటిసారిగా బాలలతో స్నేహపూర్వక కోర్టును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇకపై పిల్లలతో కలిసి పనిచేసే వారికి, వసతి కల్పించే వారి గత చరిత్రపై పోలీస్ నివేదిక తప్పనిసరి అని వివరించారు.

ప్రత్యేక ఠాణాలు..

లైంగిక నేరాలకు గురయ్యే బాధితులకు అందించాల్సిన హక్కుల గురించి వివరించారు. దిశ చట్టం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్లు సైతం పోక్సో చట్టం అమలుకు ఉపయోగపడుతున్నాయన్నారు.

అదే ప్రథమ కర్తవ్యం..

బాలలకు రక్షణ ఇవ్వటం ప్రథమ కర్తవ్యమన్నారు . పోలీసులు ,శిశుసంక్షేమ , జువైనల్ బోర్డు అందరూ కలిసి లైంగిక వేధింపులకు గురైన బాలలకు అండగా ఉండాలని ..వారికి కావాల్సిన సాయం అందించాలన్నారు.

ఇవీ చూడండి : 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.