తెదేపా నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించము - former MLA Tangirala Soumya opposed the attacks on BC woman
తెదేపాకు సహకరించారనే ఉద్దేశంతోనే బీసీ మహిళపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. దీనిపై కృష్ణా జిల్లా చందర్లపాడు పోలీసులు కేసు నమోదు చేస్తే.. వైకాపా నాయకులు తిరిగి తెదేపా వారిపై ఎదురు కేసు నమోదు చేశారని ఆరోపించారు.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో మండల పరిషత్ ఎన్నికల్లో తెదేపాకు సహకరించిన కారణంగానే బీసీ మహిళపై దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. ఈ విషయంపై కేసు నమోదు చేస్తే వైకాపా నాయకులు.. తిరిగి తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. పరిషత్ ఎన్నికల సమయంలో కోనయ్యపాలెం గ్రామంలో ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తుండగా.. తెదేపాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సమాచారం ఇవ్వటంతో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అధికార పార్టీ ఆటోను వదిలేశారని ఆమె ఆరోపించింది. అదే ఆటోలో ముప్పాళ్ల గ్రామంలో ఆ రోజు సాయంత్రం మద్యం రవాణా చేస్తుండగా.. పట్టుకున్నారని తెలిపారు. రెండు చోట్లా ఒకే ఆటోలో ఉదయం సాయంత్రం మద్యం రవాణా చేసిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. తెదేపా నాయకులు, కార్యకర్తల జోలికొస్తే సహించమని హెచ్చరించారు.
బీసీ ,ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ వర్గాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని రాష్ట్ర బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు నూకమ్మ హెచ్చరించారు. రాష్ట్రంలో వైకాపా నాయకులు దౌర్జన్యం చేస్తూ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి దాడులను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇదీ చదవండీ.. పొందూరు పీఎస్లో లొంగిపోయిన తెదేపా నేత కూన రవికుమార్