రాష్ట్రంలో వైకాపా నాయకుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయని కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం పక్కన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆఫ్ఘనిస్తాన్, గుజరాత్ నుంచి మాదక ద్రవ్యాలు తరలి రావటానికి ఎవరు సహకరించారని అన్నారు. వీటితోపాటు ఇసుక, మైనింగ్, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వందల కోట్ల రూపాయలు కమిషన్‌గా పుచ్చుకుంటారని ఆరోపించారు.
నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇసుక మాఫియా, భూ మాఫియా తదితరాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైకాపాను హెచ్చరించారు.
ఇదీ చూడండి: MPP ELECTIONS: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు