అవినీతి ఆరోపణల్లో విచారణ ఎదుర్కొంటున్న అధికారులపై.. కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మాజీ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రభుత్వానికి విన్నవించారు. మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్... సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో చూడకుండా తమపై అవినీతి పేరుతో అక్రమ ఆస్తులు కేసులు బనాయించారని ఆరోపించారు. తనకు పేరు కోసం కింది స్థాయి అధికారులను టార్గెట్లు చేసి మరీ ప్రభుత్వాధికారులపై కేసులు బనాయించారని ఆరోపించారు. తమపై పెట్టిన కేసులను త్వరగా విచారించి తప్పు చేసిన వారికి శిక్షలు పడేలా చేయాలన్నారు. lప్పు చేయని అధికారులకు వెంటనే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.
'ఆర్పీ ఠాకూర్ మాపై అక్రమ కేసులు పెట్టారు' - government employees
ఏసీబీ మాజీ డీజీ, రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తమపై తప్పుడు కేసులు బనాయించారని కొంతమంది ఆరోపించారు. ఆయన పెట్టిన కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.