ETV Bharat / state

ఏడాదిలో రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు రూ.638 కోట్లు - ఏపీకి విదేశీ పెట్టుబడులు తాజా వార్తలు

గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.638 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇదే సమయంలో తెలంగాణకు రూ. 8,617 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.

foreign investments to andhra pradesh during last year
ఏపీకి విదేశీ పెట్టుబడులు
author img

By

Published : Jun 25, 2021, 7:09 AM IST

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి మొత్తం రూ.6,14,127 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో తెలంగాణకు రూ.8,617.71 కోట్లు (1.40%) రాగా, ఆంధ్రప్రదేశ్‌కు రూ.638.72 కోట్లు (0.10%) వచ్చాయి. డీపీఐఐటీ 2019 అక్టోబరు నుంచి ఎఫ్‌డీఐలను రాష్ట్రాలవారీగా విభజిస్తూ వస్తోంది. దీని ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు దేశం మొత్తానికి రూ.1,71,558 కోట్ల ఎఫ్‌డీఐలు రాగా, 2020 ఏప్రిల్‌- 2021 మార్చి మధ్య ఏడాది కాలంలో రూ.4,42,568 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీకి 2019 అక్టోబరు నుంచి 2020 మార్చి వరకు రూ.1,475.99 కోట్లు రాగా, గత ఏడాది కాలంలో రూ.638.72 కోట్లు వచ్చాయి. తెలంగాణకు ఇదివరకు రూ.4,865.19 కోట్లు రాగా, గత ఏడాది కాలంలో రూ.8,617.71 కోట్ల విదేశీ పెట్టుబడులు దక్కాయి.

ఇదీ చదవండి:

KRMB: శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.