రైతు సమస్యలపై విజయవాడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి.. వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే కృష్ణమ్మను బంధించిన కేసీఆర్.. గోదావరినీ బంధించాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాయలో పడొద్దని ముఖ్యమంత్రికి గుర్తు చేస్తున్నామన్నారు. రైతుల సాగు కోసం రుణాలు, నాణ్యమైన విత్తనాలతోపాటు సకాలంలో సాగునీరు విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేసారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు వివరించే విధంగా శ్వేతపత్రం విడుదల చేయాలని, రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు.
ఇదీ చూడండి:డ్రైనేజీ సమస్య... అక్కిరెడ్డిపాలెం కంపు కంపు