కృష్ణా జిల్లా మైలవరం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో.. స్థానిక సూరిబాబు పేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. గుడివాడ పట్టణంలో స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు మాస్కులు, మజ్జిగ ప్యాకెట్లు భోజన ప్యాకేట్లు , శానిటైజర్ల్ పంపిణీ చేశారు. కరోనా లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో నగరంలోని నిరాశ్రయులందరినీ మున్సిపల్ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 500 మందికి మూడు పాఠశాలల్లో వసతి సౌకర్యాలు కల్పించారు.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో మరో 24 మందికి కరోనా.. 135కు చేరిన పాజిటివ్ కేసులు