రాష్ట్రంలో 2021-26కు పశుగ్రాస భద్రతా విధానం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను సైతం నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కమిటీలను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు అంచెల కమిటీలు..
రాష్ట్ర స్థాయిలో పశు సంవర్థక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఛైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. జిల్లా స్థాయిలో సంయుక్త కలెక్టర్ ఛైర్మన్‌గా ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చూడండి : పలకరించనున్న నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు