కరోనా లాక్డౌన్ కారణంగా ఫ్లెక్సీ మరియు యాడ్స్ వ్యాపారాలు సంక్షోభంలో కూరుకుపోయాయని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఫ్లెక్స్ ప్రింటింగ్‌తో స్వయం ఉపాధి పొందుతున్న తమను కరోనా దారుణంగా దెబ్బతీసిందని వారు విజయవాడలో ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్‌తో కొన్ని వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
అద్దెలు కట్టలేక, కరెంట్ బిల్లులు, వర్కర్స్ జీతాలు, మెయింట్‌నెన్స్ ఖర్చులు, కుటుంబ పోషణకు డబ్బుల్లేక ఎన్నో రకాలుగా అవస్థలు పడుతున్నామని వాపోయారు. ఇన్నాళ్లు పని లేకపోవడం వలన యంత్రాలు పని చేయడం లేదని.. తిరిగి పని ప్రారంభించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్స్ ప్రింటింగ్‌ను చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి రుణ సదుపాయం కల్పించాలని కోరారు.
ఇవీ చదవండి.. చాకచక్యంతో యువతి ఆత్మహత్యను ఆపిన పోలీసులు