రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో భూసేకరణ చేస్తోంది. ఈ మేరకు కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం పినపాక గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలంలో... సర్వే పేరిట అధికారులు జెండాలు పాతారు. కంగారుపడిన రైతు... తమ భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని వాపోయాడు. చదును చేయడానికి వచ్చిన డోజర్ని కుటుంబసభ్యులతో కలిసి అడ్డగించాడు. తమకు జీవనాధారం ఆ భూమేనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి: విశాఖలో హైఎండ్ ఐటీ స్కిల్ వర్సిటీ: సీఎం జగన్