విజయనగరం జిల్లా పార్వతీపురంలోని రెల్లివీధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి, 650 లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కళాధర్ తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: విజయవాడలో ఈనెల 10న గ్రేస్ కేన్సర్ రన్ - 2020