కృష్ణా జిల్లా నిజాంపట్నం హార్బరులో 200 పెద్దబోట్లు, 500 వరకు ఫైబర్ బోట్లు, 650 నాటు పడవలున్నాయి. వీటి ద్వారా నిత్యం 10 నుంచి 15 టన్నుల వరకు మత్స్య సంపదను వేటాడుతున్నారు. చేపలు, రొయ్యలు, పీతలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మత్స్య పరిశ్రమ వల్ల 10 నుంచి 15 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. బోట్లు, పడవల్లో 10 వేల మంది ఉపాధి లభిస్తుండగా, పరోక్షంగా మరో 5 వేల మందికి పని దొరుకుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది చేపలకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. రొయ్యలు మాత్రం గత ఏడాది మాదిరినే ధర కొనసాగుతుందని, పెరుగుదల లేదంటున్నారు.
చిక్కిన చేపలు
ప్రస్తుతం వేటకు వెళ్లొచ్చిన బోట్లలో ఎర్ర చేపలు, కానాగంత, సీస, పండుచేప, తెల్ల, నల్లచుక్కలు, కలంద, టైగర్, నారన్ రొయ్యలు, సముద్రపు పీతలు.. హార్బరుకు తీసుకొచ్చారు. వీటిని కేరళ, బెంగళూరు, ముంబయి, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒకసారి బోటును చేపల వేటకు పంపాలంటే రూ.లక్షపైనే పెట్టుబడి అవసరం. 8 మంది కార్మికులు వారం రోజులు చేపలు వేటాడే సమయంలో సముద్ర అలలపై బోటులోనే గడుపుతారు. వీరికి అవసరమైన నిత్యావసర సరకులు, తాగునీరు, చేపలు భద్రపరుచుకునేందుకు ఐస్, ఉప్పు, డీజిల్ తీసుకెళ్లాలి. ప్రస్తుతం వేటకు వెళ్లిన బోట్లకు చేపలు బాగానే చిక్కాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి..