ETV Bharat / state

చెరువుల తవ్వకాలు... జోరుగా అక్రమాలు.. నిర్లక్ష్యంగా అధికారులు

author img

By

Published : Jun 27, 2020, 6:53 PM IST

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో చెరువుల తవ్వకాల జాతర మొదలైంది. నెల రోజులుగా గ్రామాల్లో భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుంతలు, పోరంబోకులు, డ్రెయిన్లు కలిపేస్తూ తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.

చెరువుల అక్రమ తవ్వకాలు
చెరువుల అక్రమ తవ్వకాలు

జిల్లాలోని చేవూరు, కాకరవాడలో చేస్తున్న చెరువు తవ్వకాలకు సరైన మార్కింగ్‌లు ఇవ్వకుండానే తవ్వకం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువు నీరు పక్క పొలాలు, ఇళ్లకు ఇబ్బంది కలగకుండా తవ్వాల్సిన ‘సీ’ఫేజ్‌ కాలువలు ఎవరూ తవ్వడం లేదు. చినవాడవల్లిలో రెండు భారీ చెరువులు తవ్వుతున్నారు. పెడన, ముదినేపల్లి సరిహద్దులో జరుగుతున్న ఈ కార్యక్రమంతో పొక్లెయిన్లు, బుల్‌డోజర్ల శబ్ధాలు హోరెత్తుతున్నాయి. ప్రధాన రహదారి, డ్రెయినేజీలను ఆనుకుని గట్లు వేస్తున్నారు. అనుమతులు వచ్చిన భూమితో పాటు రాని వాటిని సైతం కలిపి చినవాడవల్లిలో చెరువు తవ్వేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పెదగొన్నూరు శివారు కర్షకమాలపల్లిలో చేస్తున్న చెరువు తవ్వకాల్లో కనీస నిబంధనలు పాటించటం లేదు. పుంతలు సైతం ఆక్రమించేసి తవ్వుకుంటున్నారు. కాలువలకు, రహదారులకు వదలాల్సిన దూరం ఎక్కడా పాటించటం లేదు. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల ఛోటా మోటా నాయకులు చక్రం తిప్పుతూ చిన్నచిన్న రైతులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తవ్వకం చేయాలంటే అనుమతులు దగ్గర నుంచి తవ్వకం వరకు అంతా తామే చేయాలంటూ మధ్యవర్తిత్వం పేరుతో సొమ్ములు దండుకుంటున్నారు. రెవెన్యూ, డ్రెయినేజీ, ఇరిగేషన్‌, ఇతర శాఖల అధికారులెవరూ పట్టించుకోకపోవటంతో తవ్వకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ అంశంపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. తాము ఆ చెరువులకు అనుమతులు ఇచ్చామని, డీఎల్‌సీ నుంచి అనుమతి వచ్చిందో లేదో తెలియదని చెప్పారు. ఇటీవల పుంత, కాలువ తవ్వుతుంటే వెళ్లి ఆపామని, మళ్లీ తవ్వుతున్నారని తమ దృష్టికి రాలేదని తెలిపారు. వెంటనే పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతుంటే పనులు నిలిపివేయిస్తామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.