ETV Bharat / state

తొలివిడత పంచాయతీ ఎన్నికలకు.. జిల్లాలో ముగిసిన నామపత్రాల పరిశీలన

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ముగిసింది. ఇందులో సక్రమంగా లేని, నిబంధనలకు లోబడి లేని నామపత్రాలను అధికారులు తిరస్కరించారు.

First Round
First Round
author img

By

Published : Feb 2, 2021, 10:37 AM IST

తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. విజయవాడ డివిజన్‌లోని 14 మండలాల్లో మొత్తం 64 సర్పంచి స్థానం, 214 వార్డు స్థానాలకు సంబంధించి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జగ్గయ్యపేట మండలంలోని పంచాయతీల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ రెండోసారి చేపట్టడంతో బాగా ఆలస్యమైంది. తుదిగా బరిలో 1,306 సర్పంచి, 7,670 వార్డు స్థానాలకు అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అంతిమంగా ఎంత మంది బరిలో ఉన్నారో తేలే అవకాశం ఉంది. అక్కడక్కడా మినహా మొదటి విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో వివాదాలు పెద్దగా చోటుచేసుకోలేదు.

ఇబ్రహీంపట్నం మండలంలోని పంచాయతీలకు వేసిన సర్పంచి, వార్డు స్థానాలకు అన్ని పత్రాలు సక్రమంగానే ఉన్నాయి. వత్సవాయి మండలంలో ఎక్కువగా తిరస్కరణకు గురయ్యాయి. ఎక్కువ తిరస్కరణలు వయస్సు తప్పుగా నమోదు చేయడం, సంబంధిత అభ్యర్థిని ప్రతిపాదించేవారు వేరే వార్డు ఓటర్లు కావడం, రెండో సెట్‌ పత్రాలు, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు, తదితర కారణాల వల్ల అధికారులు పక్కనపెట్టారు.

మైలవరం పంచాయతీ 5వ వార్డుకు తెదేపా మద్దతుతో నామినేషన్‌ వేసిన అభ్యర్థి పోలీసు కేసులు లేనట్లు పత్రం సమర్పించారు. దీనిపై ప్రత్యర్థులు అభ్యంతరం చెప్పారు. పరిశీలనలో కేసులు ఉన్నట్లు తేలడంతో నామినేషన్‌ను పక్కన పెట్టారు. ఇదే మండలం కనిమెర్లతండాలో 5 వార్డులకు తెదేపా, వైకాపా మద్దతుతో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వేరే వార్డుల వారిని ప్రతిపాదకులుగా పెట్టడమే కారణం.

కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెం పంచాయతీలో ఎనిమిది వార్డులకు సంబంధించి ఒక్కొక్క నామినేషనే పడడంతో ఏకగ్రీవం కానున్నాయి. పెనుగంచిప్రోలు పంచాయతీ సర్పంచి స్థానానికి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నకుమారి ఎస్సీగా తన కులధ్రువీకరణ పత్రం అందజేశారు. దీనిపై వైరివర్గం వారు అభ్యంతరం చెప్పారు. ఆమె బీసీ (సి) అని వాదించారు. ఆర్వో ఈ విషయాన్ని తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. అంతిమంగా తహసీల్దారు ఆమె బీసీ (సి) అని తేల్చడంతో నామినేషన్‌ను తిరస్కరించారు.

ఎనికేపాడు సర్పంచి స్థానానికి తెదేపా మద్దతుతో బరిలోకి దిగిన బాలకోటేశ్వరరావుపై కేసులకు సంబంధించి ప్రత్యర్థి వర్గం అభ్యంతరం చెప్పింది. దీనిపై పంచాయతీ కార్యాలయం వద్ద కొద్దిసేపు తెదేపా వర్గీయులు ఆందోళన చేశారు. చందర్లపాడు ముప్పాళ్లలో సర్పంచి స్థానానికి ఇద్దరు నామినేషన్లు వేశారు. వీరు కులధ్రువీకరణ పత్రాలను సోమవారం సమర్పించారు. దీనిపై తెదేపా వర్గీయులు అభ్యంతరం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే సౌమ్య వచ్చి ఆందోళన చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కులధ్రువీకరణ పత్రాలను ఆర్వో అనుమతించారు.

ఇదీ చదవండి: బలవర్ధక ఆహారానికి బహుదూరంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.